వసంత కాలం

 వసంత కాలంలో 

ఓ ఉషోదయం వేళ... చలిగాలి పలకరించింది

చల్లని పిల్లగాలి.. పలకరిస్తూ తరలి పోయింది..

ఆకాశ వీధి నుంచి... కంటి ముందుకు మంచు పరదా కమ్ముకొచ్చింది..

దవళవర్ణపు మంచుపొగ.. నేలనంతా ఆక్రమించింది..

నీలిరంగు మేఘాన్ని చీల్చలేక.. భానుడు ఓడుతున్నాడు..

పచ్చని ఆకుపై  మంచు బిందువు  పరుగులిడుతూ రాలుతోంది..

ప్రియుడిని పలకరించి.. పరుగులిడుతున్న జాణ కొంటెతనంలా..

తుషారహేళ సాగుతోంది..

తల్లి ఒడిలో బద్దకం వదలని చిన్నారిలా..

ప్రేమ మైకంలో కొత్త దంపతుల కౌగిలిలా..

శిశిరం.. మత్తెక్కిస్తోంది..

Comments

Popular Posts