నిమజ్జనం అంటే ఏమిటి..?

 నిమజ్జనం అంటే.. స్నానం అని అర్ధం..


హైందవ సంస్కృతిలో ముక్కొటి దేవతులు ఉంటారు. వారందరి పేర్లని చెప్పమని అడిగితే.. బహుశా చెప్పడం సాధ్యం కాదేమో.. కానీ ప్రధాన దేవతల పేర్లు మాత్రం సులభంగా చెప్పవచ్చు.. ఈ క్రమంలోనే  ఆది పూజ అందుకునే గజాననుడు.. మాత్రం అందరికీ ఇష్టం.. పైగా గజముఖం కావడంతో.. పిల్లలకు ఈ మూర్తి అంటే ఎంతో ఆసక్తిగా ఉంటుంది.. స్వామివారికి భాద్రపద మాసంలో తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు.. ఆనంతరం అంగరంగ వైభవంగా తీసుకుని వెళ్లి గంగలో విడిచి పెడతారు.. 
      అందరు దేవుళ్లను ఎందుకు నిమజ్జనం చేయరు.. కేవలం దుర్గామాతను.. గ్రామ దేవతలను.. గణనాథుడిని మాత్రమే నిమజ్జనం చేస్తారు.. ఈ ప్రశ్న చాలా విశేషమైనది.. 
       గణనాథునికి నవవిధ భక్తులతో పూజలు చేయవచ్చు.. కానీ ఆయన లంబోధరుడు.... మోదక ప్రియుడు..  అందుకే ఆయనకు భక్తి శ్రద్దలతో అందించే నైవేద్యం పరిమాణం.. స్వామికి తగినట్లుగా ఉండాలి.. కానీ ఆయనకు ఆతరహాలో రోజు భోజనాన్ని అందించడం మానవ మాత్రునికి సాధ్యం కాని పని... అందుకే.. స్వామిని పుట్టిన రోజు నాడు పిలిచి పూజించి.. తర్వాత.. జాగ్రత్తగా తన లోకాలకు గంగమ్మ మాధ్యమంగా తరలిస్తారు.. దీనినే నిమజ్జనం అంటారు..
       కొన్ని ప్రాంతాల్లో దసరా తర్వాత దుర్గామాతను కూడా అలాగే సముద్ర తీరాల్లోకి.. తరలింపజేస్తారు.. నెల్లూరు వెంకటగిరిలోని పోలేరమ్మ జాతరలో కూడా... అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారిని పుట్టింట పుట్ట మన్నుతో బొమ్మను తయారు చేస్తారు.. ఆనంతరం మెట్టినింటికి తరలించి.. అక్కడ కళ్లు పెడతారు.. అపై అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనం పై ఉంచి.. ఊరేగిస్తారు. ఆ సమయంలో.. అమ్మవారి కోసం తెగె.. కోళ్లు.. మేకలు, పొట్టెళ్ల తలలకు లెక్క ఉండదు.. గుట్టు చప్పుడు కాకుండా.. ఎనుబోతును కూడా ఒక్కవేటుకు తెగనరికి... అమ్మకి నైవేధ్యంగా ఉంచుతారు.
ఆతర్వాత ఆలయం వద్ద అమ్మవారిని బొమ్మను నిలిపి.. కేవలం కొన్ని గంటల తర్వాత... సూర్యుడు మబ్బుల మాటుకు చేరుకునే సరికి.. అమ్మవారిని నిమజ్జనానికి తరలిస్తారు.. అయితే.. ఇక్కడ నిమజ్జనం ప్రత్యేకంగా జరుగుతుంది.. అమ్మవారి బొమ్మను నిమజ్జన ప్రదేశానికి తీసుకెళ్లి.. బొమ్మను తయారు చేసిన మట్టిని ప్రజలు ఒలుచుకుని తీసుకుని వెళ్లిపోతారు.. ఆ మట్టిని పొలాల్లో చల్లితే బలమని.. బొట్టు పెట్టుకుంటే చీడపీడలు దరిచేరవని... ఇంటిలో ఉంచుకుంటే.. సర్వశుభాలు జరుగుతాయని విశ్వాసం.. 
       ఇవన్నీ ఇలా ఉంటే.. గణనాథునికి ఉత్సవాలు నిర్వహించడంలో ప్రత్యేకత ఉంది.. భాద్రపద మాసంలో వినాయక చవితిని నిర్వహించడం ఆనవాయితీ.. విఘ్ననాథునికి తొమ్మిదిరోజుల పాటు పూజలు చేసి.. ఆనంతరం గణేశుని.. వైభవంగా గంగమ్మ ఒడిలోకి సాగనంపడం జరుగుతుంది. గణనాథునికి బహిరంగ ఉత్సవాల విధానం మాత్రం.. 18వ శతాబ్ధం తర్వాత మాత్రమే వచ్చింది. దీనికి సంబంధించి ఓ చారిత్రక వాస్తవం.. ఉంది.. 18వ శతాబ్ధంలో భారత దేశంలో స్వాతంత్ర ఉద్యమ స్పూర్తి తీవ్రంగా రగులు తోంది.. అయితే ఇప్పటిలా సోషల్ మీడియాలు.. అంతర్జాలాలు విస్తృతంగా లేవు... ఒక ఉద్యమం విషయం మరో ప్రాంతానికి తెలియాలంటే.. రోజులు వారాలు పట్టేది.. అలాంటి సమయంలో ప్రజలందరినీ ఒక్కటిగా చేర్చేందుకు నాయకులు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొనేవారు.  రాజకీయ సమావేశాలకు మినహా మిగిలిన కార్యక్రమాలను ప్రజలను ఒక్క చోట చేర్చడం కష్టంగా మారేది.. దీనిక తోడు.. నాటి బ్రిటీష్ ప్రభుత్వ విధానాలు... కఠిన నియమాలు.. ప్రజలు ఇబ్బంది పెట్టేవి... ఆసమయంలోనే ఈ పరిస్థితులకు పరిష్కారం కనుగొన్నాడు బాలగంగాధర్ తిలక్... తొలిసారిగా.. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమంగా అందరినీ ఏకం చేసేందుకు వినాయక చవితిని ఆయన బహిరంగంగా నిర్వహించారు. ప్రతి ఏడాది వినాయక చవితి వేడుకల పేరుతో ప్రసిద్ధ కూడళ్లలో గణేశుని బొమ్మలను పెట్టడం.. ఆ మిషతో సమాచారాన్ని బట్వాడా చేసుకోవడం జరిగేది.. 
     వినాయక చవితి ఉత్సవాలకు కారణం ఉన్నట్టే.. వినాయకుని మట్టి విగ్రహం తయారీకి కూడా.. సామాజిక పరమైన ప్రత్యేకత ఉంది.. ఉత్సవాలను నిర్వహించే సమయంలో.. బొమ్మలను మట్టితో మాత్రమే తయారు చేసేవారు.. దీని కోసం చెరువునుంచి తీసిన బంక మట్టి ఎంతగానో ఉపయోగ పడేది..  ఇదిలా ఉంటే.. ప్రతి గ్రామానికి ఒక చెరువు తప్పని సరిగా ఉండేది.. వర్షకాలంలో వెల్లువగా వచ్చిన నీటితో మాత్రమే ఈ చెరువులు నిండేవి.. కానీ కాలక్రమంలో చెరువులు పూడుకుని పోయి.. వెల్లువ నీరు వృధాగా పోయేది.. చెరువులో నీటి సామర్థ్యం పెరిగేలా చేసేందుకు ... వినాయకుని విగ్రహాలను తయారు చేసేందుకు  చెరువుల్లో పూడిక తీసి.. ఆ మట్టిని బొమ్మలకు వినియోగించేవారు.. వీటి వల్ల ఆయా గ్రామాల్లో నీటి అవసరాలకు తగినంతగా నీరు ఉండేది.. పూడిక తీతతో భూగర్భ జలమట్టం కూడా పెరిగేది..

      సమాజానికి ఉపయోగకరమైన పనిని చేసేందుకు వినియోగించే.. నిమజ్జనాన్ని.. ప్రస్తుతం.. ఆడంబరాలకు చిహ్నంగా జరుపుకుంటున్నారు. ఎంత ఎత్తు బొమ్మ పెడితే.. అంతగొప్ప.. మట్టి మినహా మిగిలిన అన్ని పదార్థాలతో బొమ్మలు చేయడం ఫ్యాషన్.. దీంతో ప్రకృతి క్షోభకు గురవుతోంది..  ఈ పరిస్థితి మారాలంటే.. ప్రకృతిపై ప్రేమ పెంచుకోవాలి.. మట్టి విగ్రహాలవైపు.. అందరూ మరలాలి..
                       -  కోణార్క. జొన్నలగడ్డ

Comments

  1. నిమర్జనం లో చాలా కొత్త విషయాలు చెప్పారు sir.

    ReplyDelete

Post a Comment

Popular Posts