కృష్టం వందే జగద్గురుం.. 

         విశ్వ వాజ్ఞ‌్మయంలో మహాభారతానికి విశిష్ట స్థానం ఉంది.. అంతటి భారతంలో.. అత్యున్నత ప్రతిభావంతమైన పాత్ర భీష్ముడిది.. అంతటి మహా జ్ఞ‌ాని  భీష్ముడు సైతం జగద్గురువుగా  శ్రీకృష్ణుడిని కొనియాడాడు.. చిలిపి కృష్ణుడిగా.. రాజకీయ జ్ఞ‌ానిగా.. గోపికా లోలునిగా.. భక్త జన రక్షకునిగా.. కృష్ణుని జీవన యానం అద్భుతం.. కృష్ణవర్ణంలో... ఉండే.. కన్నయ్య.... అందరి మధ్య ఉంటూ.. అందరికీ ఆత్మబంధువుగా నిలుస్తూ... అత్మ సాక్ష్యాత్కారాన్ని చూపి.. మహిమలు కనబరిచిన వాడు... నందనందనుడే... 



    శ్రీకృష్ణ జననం... చిన్నతనం.. పూతన వధ.. శకటాసుర సంహారం.. గోవర్ధన ఉద్ధరణ.. కంస వధ.. ఇవ్వన్నీ.. కృష్ణ భక్తులను ఆనంద డోలికల్లో ఒలలాడిస్తాయి... అయినా ఒకసారి.. కృష్ణ కథనం తరచి చూసి ఆనందిద్దాం..

        కంసుని చెరసాలలో దేవకీదేవికి అష్ణమ గర్భునిగా జన్మించిన దేవకీ నందనుడు.. తండ్రి సాయంతో వ్రేపల్లెకు చేరాడు.. యశోదా తనయునిగా పెరుగుతూ.. కన్నతల్లి..పెంచిన తల్లి అనే వ్యత్సాసం లేదని చూపుతూనే.. యశోదాదేవి గోరు ముద్దలను... చేతి దెబ్బలను సమంగా తింటూ పెరిగాడు. చిన్నతనం లోనే ప్రజ్ఞ‌ చూపుతూ... కంసుడు పంపిన పూతన, శకటాది అసురులను అసువుగా హతమార్చాడు. పసితనం పూర్తిగా వీడక మునుపే..కంసుని ఆహ్వానం మేరకు.. ధనుర్యాగా దర్శనం కోసం మధుర చేరారు. అక్కడ తమ కోసం కంసుడు నియమించినన చాణూర ముష్టీకులనే మల్లయోధులను... కువలయ పీడమనే మదపు టేనుగును.. హతమార్చారు.. మామా కంసుని హతమార్చి..  మాతా మహుడైన ఉగ్రసేనునికి రాజ్యాన్ని కట్టబెట్టాడు.. మేనత్త కుంతిదేవితో ఉన్న బాంధవ్యాన్ని గుర్తుంచుకుని పార్థునికి సారధిగా మారి.. కురుక్షేత్ర సంగ్రామంలో పార్ధసారధిగా తన కౌశలాన్ని చూపిన మహా మేధావి గోకుల ప్రియుడు..



       యశోదా నందుడు.. నందనందనుడు.. . గోవిందుడు.. గోవర్ధనుడుఇలా ఎన్నో పేర్లతో అబాల గోపాలం గోపాలుడిని స్మరిస్తూనే ఉంటారు.. కానీ కృష్ణుడు అనేది అతని పేరు.. దీనికి ప్రత్యేకమైన అర్ధం.. ఉంది..

        వాస్తవానికి కృష్ణ అనే పదానికి నలుపు అని... కృష్ అంటే నాగలి అని భావం.. కృషి అంటే వ్యవసాయం అని కూడా అర్ధం ఉంది. నాగలితో భూమిని దున్ని సంపదను సృష్టించినట్టుగా.. నందనందుడు అధర్మ ప్రజ్వరిల్లుతున్న సమయంలో..  ధర్మాన్ని వెలికితీశాడని ప్రతీతి..  

         కొన్ని తిథులపై ప్రజలకు విశ్వాసం తక్కువ... వాటిని చెడు తిథులుగా భావిస్తారు.. కానీ ఎనిమిది మంది భార్యలను పొందిన శ్రీకృష్ణుని జన్మతిధి అష్టమి.. సాధారణంగా ప్రజలు దీనినివిశ్వసించరు.. యాదవ రాకుమారుడైన తాను.. అన్ని వర్ణాల్లోని స్త్రీలను వివాహమాడి.. మానవుల్లో అంతరాలకు అవకాశం ఉండకూడదని నిరూపించాడు. ప్రేమకు మాత్రమే తాను లొంగుతాననే విషయాన్ని సర్వదా తెలియజేస్తూనే వచ్చాడు. స్వతహాగా రాజుగా రాజ్యాలను ఏలకపోయినా... సమయానికి తగినట్లు.. వ్యూహాలను రచిస్తూ.. ముందుకు సాగే.. రాజనీతి వేత్త..  శ్రీకృష్ణుడు..  పలు చోట్ల రణ చోరుడుగా పేరు వచ్చినా.. దానిని వ్యూహంలో భాగంగా మలిచి.. విజయాన్ని పొందిన వాడు యదు సింహుడే.. కురుక్షేత్రంలో తాత తండ్రులను, సోదరులను మిత్రులను బంధువులను కొడుకులను, మనుమలను, మేనమామలను, బావలను చూసి... గాండీవాన్ని నేలకు వదిలిన అర్జునునికి పురుష ప్రయత్నం విలువను... యుద్ధంలో పాటించాల్సిన నియమాలను.. జీవితంలో పలు సందర్భాల్లో ఎదురయ్యే సమయాలను... వాటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన మానసిన ధైర్యాన్ని పెంపొందించుకున్న అత్యున్నత బోధకుడు... గీతాకారుడే.. 



       మహా విష్ణువు అవతారం శ్రీకృష్ణుడు అనే విషయం అధ్యాత్మికం.. కానీ  రాజనీతి వేత్తగా నేటికీ అడుగడుగునా కృష్ణ ప్రస్తానం.. కనిపిస్తూనే ఉంది. నేటి కార్పొరేట్ సంస్థల్లోనూ, మేనేజ్ మెంట్ విద్యాలయాల్లోనూ కృష్ణుని బోధనలను పలు సందర్భాల్లో పేర్కొంటూనే ఉంటారంటే.. ఐదువేల ఏళ్ల నాటి గోప బాలుని మేధస్సుని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు..  ఎప్పటికైనా దైవ శక్తి  కన్నా.. పురుష ప్రయత్నం.. ఆత్మ నిర్భరత గొప్పవని నిరూపించిన మహా నాయకుడు కృష్ణ భగవానుడే.. మహా భారతంతో పలువురుకి కృష్ణ నామం ఉంటుంది.. పాండవుల పత్ని ద్రౌపతీదేవి పేరు కృష్ణ, అర్జునుని దశనామాల్లో ఒకటి కృష్ణ,  భారత ఇతిహాసాన్ని ప్రజాళికి అందించిన వేదవ్యాసుని పేరు కృష్ణ ద్వైపాయనుడే. 

       
       పుట్టింది చెరసాలలో.. పెరిగింది యశోద ఒడిలో.. ఆత్మ జ్ఞ‌ానాన్ని బోధించింది తల్లి దేవకికి.. ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డగా ప్రేమను పొందిన చిన్నారి కృష్ణుడు... అష్ణభార్యలతో జీవితాన్ని గడిపినా.. 16 వేల మందిని చేపట్టాడు..  గోపికా రమణులతో సరససల్లాపాలాడాడు.. అయినా..  బంధాలన్నింటిలో ఇమిడి ఉన్నా.. ఏ బంధం అంటకుండా.. తామరాకుపై నీటి బొట్టులా జీవనాన్ని సాగించాలనే అద్భుత వాస్తవాన్ని అర్ధం చేసుకున్నాడు.. అందుకే  అందుకే అస్కలిత బ్రహ్మచారిగా... బ్రహ్మాస్త్రం బారిన పడిన అభిమన్యుని బిడ్డ పరీక్షిత్తుకు ప్రాణదానం చేశాడు.. సాక్ష్యాత్తు భీష్ముడు... విష్ణు సహస్ర నామాలను ధర్మరాజుకు బోధించే సమయంలో... శ్రీకృష్ణుని జగద్గురువుగా అభివర్ణించాడు.. అందుకే ఎప్పుడైనా.. ఎక్కడైనా.. శ్రీకృష్ణుడు సర్వదా వందనాలను అందుకునేందుకు అర్హుడు... అనడంలో ఎటువంటి సందేహం అవసరంఉండదు.. 



Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Thanks for the mythology information 👍

    ReplyDelete
  3. కృష్ణుని గురించి ఎంత చదివినా ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది. కృష్ణుని పేరుతో ఆ రచన కే అందం వస్తుంది.

    ReplyDelete

Post a Comment

Popular Posts