అమ్మ
అమ్మ..
------------
అమ్మ అంటే.. అద్భుతం..
అమ్మంటే అమృతం
అమ్మంటే ఆశ్చర్యం
అమ్మంటే ఆనందం
అమ్మంటే కమ్మని జీవితం..
నవమాసాలు మోసి..
పురిటి నెప్పులను ఆనందంగా భరించి
బిడ్డను అక్కున చేర్చుకున్న క్షణాన
అప్పటి వరకు పడిన బాధను మరుస్తుంది అమ్మ..
బిడ్డ మలమూత్రాలను
ఆప్యాయంగా ఎత్తిపోస్తుంది.
అల్లరిని భరిస్తుంది..
ఆటలను ఆనందిస్తుంది
గర్భంలో పదినెలలు దాచుకునే అమ్మ..
బిడ్డకు గడ్డాలొచ్చేవరకు
కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటుంది.
బిడ్డ కుంటైనా.. గుడ్డైనా..
అందగాడైనా.. విహీనుడైనా
తల్లికి చంద్రునితో సమానం..
బిడ్డ బొర్లపడినా.. పారాడినా..
నడిచినా.. పరుగులుతీసినా..
ఉంగా ఉంగా స్థాయి నుంచి..
ఊరి మీద పెత్తనం చేసే స్థితికి వచ్చినా..
ప్రతీది తల్లికి ఆనందమే.. అద్భుతమే..
అమ్మ విలువ తెలుసుకోావాలంటే.
అమ్మలేనివారిని.. కొల్పొయిన వారిని అడిగితే తెలుస్తుంది..
అమ్మ ప్రేమను నిర్వచించడం
నాలుగు తలల వాడికైనా అసాధ్యమే..
- కోణార్క జొన్నలగడ్డ
ఓ అమ్మ గా చెప్తున్నా...అద్భుతంగా ఉంది
ReplyDeleteకళ్ళు చెమర్చాయి sir.
ReplyDelete