అమ్మ నాకు తెలియదు...
అమ్మ నాకు తెలియదు
---------------------
అమ్మ మీద ప్రేమంటే.. నాకు తెలియదు
అమ్మంటే ..ప్రేమ అని మాత్రమే తెలుసు
అమ్మ మీద భక్తి.. నాకు తెలియదు..
అమ్మ కొంగుతో ఆడుకునే ఆనందమే తెలుసు..
అమ్మంటే భయం నాకు తెలియదు..
అమ్మ వేలు పట్టుకుని నడిస్తే వచ్చే ధైర్యం తెలుసు
అమ్మ మీద గౌరవం.. నాకు తెలియదు..
కమ్మని కథలు వింటూ అమ్మ గుండెలపై నిద్రపోవడం తెలుసు
అమ్మంటే ఆరాధన ..నాకు తెలియదు
అమ్మ వండే అప్పాల ఘుమఘుమలు తెలుసు
అమ్మకు మర్యాద చేయడం ..నాకు తెలియదు
అమ్మను చేతి దెబ్బల తియ్యని ప్రేమ రుచి తెలుసు
అమ్మ గొప్పతనం.. నాకు తెలియదు
అమ్మంటేనే గొప్ప.. అని మాత్రమే తెలుసు
అమ్మ పదానికి అర్ధం .. నాకు తెలియదు
ఆ అర్ధం దేవుడకి కూడా తెలియదని నాకు తెలుసు..
- కోణార్క జొన్నలగడ్డ
అమ్మతో మీ అనుబంధం చాలా చక్కగా వివరించారు అండి...
ReplyDeleteఅమ్మ ప్రేమ ను అక్షరాలలో చెప్పనలవి కాదని, గొప్పగా చెప్పారు sir.
ReplyDelete